Skip to main content

పీఎం 2.5 అంశంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం?

గాలిలో కాలుష్యకారకమైన సూకా్ష్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5 అంశంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
Current Affairs
అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020’లో ఈ విషయం వెల్లడైంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

గాలిలో పీఎం 2.5

భారత్

83.2

నేపాల్

83.1

రిపబ్లిక్ ఆఫ్ నైజర్

80.1

ఖతార్

76.0

నైజీరియా

70.4


ఎన్‌ఓజీఏ నివేదికలోని ప్రధానాంశాలు

  • గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్‌లోనే అత్యధికం. 2019 ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు.
  • భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి.
  • గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి.
  • వాయు కాలుష్యంతో భారత్‌లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పీఎం 2.5 అంశంలో మొదటి స్థానంలో భారత్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 22 Oct 2020 05:54PM

Photo Stories