Skip to main content

పీఎల్‌ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్‌సెంటివ్ (పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
Current Affairsప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మార్చి 21న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అరుుదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఎలక్ట్రానిక్ కంపెనీలకు 41వేల కోట్లు
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్‌సెంటివ్‌‌సను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు  
  •  రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్‌కు ఆమోదం.
  •  జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా.
  • పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయింపు.
    క్విక్ రివ్యూ :
    ఏమిటి
    : పీఎల్‌ఐ పథకానికి ఆమోదం
    ఎప్పుడు : మార్చి 21
    ఎవరు : కేంద్ర కేబినెట్
    ఎందుకు : దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి
Published date : 23 Mar 2020 06:37PM

Photo Stories