Skip to main content

పెట్రోల్‌లో ఇథనాల్‌ పరిమాణాన్ని ఎంత శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది?

ప్రతీ లీటర్‌ పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమ పరిమాణాన్ని 20 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Current Affairs ఇందుకు సంబంధించిన ‘ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌ 2020–25’ నుజూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ వాటా అనే లక్ష్యాన్ని 2030 ఏడాదికల్లా సాధించాలని గతంలో అనుకున్నాం. కానీ, అంతకుముందే(2025కల్లా)సాధించాలనేది మా ఆకాంక్ష అని పేర్కొన్నారు.చెరకు నుంచి ఇథనాల్‌ను తయారుచేస్తారు.పాడైపోయిన గోధుమలు, నూక(విరిగిన బియ్యం)లు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను భారీ మొత్తంలో ఉత్పత్తిచేయొచ్చు. బయోఇంథనమైన ఇథనాల్‌ వాటాను లీటర్‌ పెట్రోల్‌లో 20 శాతానికి పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని భారీ మొత్తంలో తగ్గించవచ్చు. ఇథనాల్‌ వాడకం పెరగడంతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్‌ ఆధారపడటమూ తగ్గనుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచే ఇథనాల్‌ ఉత్పత్తి సాధ్యం కనుక రైతులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారనుంది.

సమీకరణకు రూ.21వేల కోట్లు
2022 ఏడాదికల్లా పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని 10 శాతం కలపాలని, 2030కల్లా 20 శాతం కలపాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. 2014లో పెట్రోల్‌లో 1–1.5 శాతం ఇథనాల్‌ కలిపేవారు. ప్రస్తుతం ఇది 8.5 శాతానికి చేరింది. గతంలో 39 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కేంద్రం సమీకరించగా ప్రస్తుతం 320 కోట్ల లీటర్లను సమీకరిస్తోంది. 2020 ఏడాది ఇథనాల్‌ సమీకరణ కోసం చమురు సంస్థలు రూ.21వేల కోట్లు ఖర్చు చేశాయి. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉంది. దేశీయ డిమాండ్‌లో 85 శాతం చమురు విదేశాల నుంచే వస్తోంది. 10 శాతం ఇథనాల్‌ కలపాలంటే భారత్‌ 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను సమీకరించాల్సిఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2025 నాటికి ప్రతీ లీటర్‌ పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమ పరిమాణాన్ని 20 శాతానికి పెంచాలి
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌ 2020–25
ఎక్కడ : భారత్
ఎందుకు : కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని భారీ మొత్తంలో తగ్గించేందుకు...
Published date : 07 Jun 2021 07:17PM

Photo Stories