పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లి
Sakshi Education
పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 అవార్డుకు ఎంపిక చేసింది.
శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. కోహ్లి రాజస్తాన్‌లోని అంబర్ కోట వద్ద మాల్తి అనే ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ పెటాకు లేఖ రాశాడు. మూగ జీవాలపట్ల కరుణ చూపాలని తన అభిమానులకు సందేశం ఇచ్చాడు.జంతువులను కొనుగోలు చేయడం కంటే దత్తత తీసుకోవాలని సూచించాడు. బెంగళూరులోని జంతు సంరక్షణ కేంద్రాన్ని తరచూ సందర్శిస్తూ వాటి బాగోగులకు తన వంతు చేయూత అందిస్తున్నాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పెటా కోహ్లిని పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికచేసింది.
గతంలో భారత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పనికర్ రాధాకృష్ణన్, బాలీవుడ్ నటీమణులు అనుష్క శర్మ, హేమ మాలిని, జాక్వలైన్ ఫెర్నాండెజ్, హీరో మాధవన్‌లు ‘పెటా’ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డులకు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : భారత కెప్టెన్ విరాట్ కోహ్లి

Published date : 21 Nov 2019 05:51PM