Skip to main content

పెస్టిసైడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన ‘పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది.
Current Affairsఈ విషయమై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్‌సెక్టిసైడ్ యాక్ట్ - 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు.

పెస్టిసైడ్స్ బిల్లులోని అంశాలు...
  • పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా చర్యలు
  • సేంద్రియ పురుగుమందుల వాడకానికి ప్రోత్సాహం
  • పురుగుమందుల ప్రచారం క్రమబద్దీకరణ
  • నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధింపు
  • నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంపు
  • నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్ ఏర్పాటు. పెస్టిసైడ్‌‌స కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రైతులకు సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా
Published date : 13 Feb 2020 05:43PM

Photo Stories