Skip to main content

పేద దేశాల్లోనే కరోనా మరణాలు తక్కువ

అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్‌ 19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
Current Affairsనేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌ (ఎన్సీసీఎస్‌), చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు మెడ్రిక్సివ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

106 దేశాల్లో...
పరిశోధకులు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీవ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు కోవిడ్‌ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమాణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్‌ బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు.
Published date : 29 Oct 2020 05:39PM

Photo Stories