Skip to main content

పేద దేశాలకూ టీకా: డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) పిలుపునిచ్చింది.
Current Affairs
వ్యాక్సిన్ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ సూచించారు. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో టోడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్
వూహాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 2020, డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్‌ చైర్మన్ లియూజింగ్‌హెన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సంబంధించి అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ)
ఎందుకు :కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేందుకు
Published date : 20 Aug 2020 05:12PM

Photo Stories