పదోసారి హైదరాబాద్ మజ్లిస్ వశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మజ్లిస్ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారీ మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న అసదుద్దీన్ ఈసారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన దాదాపు 2.82 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు ఇది వరసగా నాలుగో విజయం. గత ఎన్నికల్లో 2.02 లక్షల ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఇప్పటికి వరుసగా పదిసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌పార్టీకి ఇదే అతిపెద్ద మెజారిటీ కావటం విశేషం. పాతనగరంలో తనకు తిరుగులేదని మజ్లిస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క గోషామహల్ అసెంబ్లీ స్థానం తప్ప మిగతా ఏడు స్థానాలూ మజ్లిస్ చేతిలోనే ఉన్నాయి.
ఔరంగాబాద్‌లో మజ్లిస్ విజయం...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మజ్లిస్ పార్టీ తొలిసారి ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు విడతలవారీగా అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. ఇంతకాలం పార్లమెంటులో ఒక్క సీటుకే పరిమితమైన మజ్లిస్ తరఫున ఈసారి దర్జాగా ఇద్దరు ప్రవేశించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సార్వత్రిక ఎన్నికల్లో వరసగా పదోసారి హైదరాబాద్ మజ్లిస్ వశం
ఎప్పుడు: మే 23
ఎవరు: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఎక్కడ: హైదరాబాద్

Published date : 24 May 2019 06:33PM