పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం?
Sakshi Education
శిరోమణి అకాలీదళ్ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు.
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు డిసెంబర్ 3న ప్రకాశ్‌సింగ్ బాదల్ ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
ఏకై క నేత...
మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ధిండ్సా సైతం...
శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి: కొత్తగా తెచ్చిన మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ప్రకాశ్‌సింగ్ బాదల్
ఎందుకు : వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా

Published date : 04 Dec 2020 06:07PM