Skip to main content

పద్మశ్రీని వెనక్కి ఇవ్వనున్న శ్యాం శర్మ

15 సార్లు జాతీయ అవార్డు పొందిన ప్రముఖ మణిపురి డెరైక్టర్ అరిబమ్ శ్యాం శర్మ తాను పొందిన పద్మశ్రీని వెనక్కి ఇవ్వనున్నట్లు ఫిబ్రవరి 3న ప్రకటించారు.
పౌరసత్వ (సవరణ) బిల్లు-2016కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పౌరసత్వ బిల్లు ఈశాన్య రాష్ట్రాలు, మణిపురిలోని ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించారు. పద్మశ్రీని వెనక్కి ఇవ్వడం ద్వారా బిల్లుపై నిరసన తెలపాలనుకుంటున్నానని వివరించారు. 2006లో అరిబమ్ శ్యాం శర్మకు పద్మశ్రీ లభించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పద్మశ్రీని వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : మణిపురి డెరైక్టర్ అరిబమ్ శ్యాం శర్మ
ఎందుకు : పౌరసత్వ (సవరణ) బిల్లు-2016కు నిరసనగా
Published date : 04 Feb 2019 06:21PM

Photo Stories