Skip to main content

పద్మశ్రీ ఎస్‌వీఎస్ శాస్త్రి కన్నుమూత

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ ఎస్‌వీఎస్ శాస్త్రి (90) హైదరాబాద్‌లో ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 1928 నవంబర్ 4న జన్మించిన ఆయన గుంటూరు హిందూ కళాశాల, బాపట్ల వ్యవసాయ కళాశాలల్లో చదువుకున్నారు. అమెరికాలోని విస్కాసిన్ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సభ్యుడిగా ఉన్నారు. ప్లాంట్‌బ్రీడింగ్, జెనిటిక్స్, సైటోజెనిటిక్స్, టాక్సానమీ, ఫిజియాలజీ, క్రాప్‌సెన్సైస్, అగ్రానమీ వంటి అంశాల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశిష్ట పరిశోధనలకుగాను 1971లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 1974లో ప్రతిష్టాత్మక బోర్లాగ్ అవార్డును కూడా అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త క న్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఎస్‌వీఎస్ శాస్త్రి (90)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 07 Feb 2019 05:58PM

Photo Stories