పద్మభూషణ్ గ్రహీత, ఎండీహెచ్ అధినేత కన్నుమూత
Sakshi Education
మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, స్పైస్ కింగ్‌గా పేరొందిన మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97) డిసెంబర్ 3న కన్నుమూశారు.
ఢిల్లీలోని మాతా చనన్ దేవీ హాస్పిటల్‌లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1923 మార్చి 27న సియాల్‌కోట్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) గులాటీ జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్ వచ్చి ఢిల్లీలో స్థిరపడింది.
అయిదో క్లాస్ వరకు...
అయిదో క్లాస్ వరకు చదివిన గులాటీ తొలుత పలు ప్యాక్టరీల్లో పనిచేశారు. ఢిల్లీ వచ్చాక గుర్రపు బగ్గీ నడిపారు. 1948 ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్(మహాశియాన్ డి హట్టి ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీని నెలకొల్పారు.
ప్రస్తుతం...
ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్‌ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిలిచారు.
2019లో పద్మభూషణ్...
తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్‌కు గులాటీ విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎండీహెచ్ అధినేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97)
ఎక్కడ : మాతా చనన్ దేవీ హాస్పిటల్, ఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా

Published date : 04 Dec 2020 06:10PM