Skip to main content

పదకోశం–మీ కోసం పుస్తకావిష్కరణ

బలమైన భావ ప్రకటన మాధ్యమంగా భాష నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు.
Current Affairs
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగంలో జూన్‌ 18న ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తీర్చిదిద్దిన ‘పదకోశం–మీ కోసం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పరిపాలన భాషగా తెలుగును పటిష్టంగా అమలు చేసేందుకు ఉపయుక్తంగా ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక, భాష, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆక్వాకు కొత్త కవచాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగ పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన 3 చట్టాలు జూలై 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. ఆక్వా రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకొచ్చిన ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీ సడా) యాక్టు–2020, ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ యాక్టు–2020, ఏపీ ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌–2020 అమల్లోకి వస్తాయని జూన్‌ 18న ప్రభుత్వం తెలిపింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తీర్చిదిద్దిన పదకోశం–మీ కోసం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూన్‌ 18
ఎవరు : రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి
ఎక్కడ : ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
Published date : 19 Jun 2021 06:37PM

Photo Stories