పది ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
Sakshi Education
దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)ను విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 30న ప్రకటించారు.
మంత్రి ప్రకటనలోని మరిన్ని ముఖ్యాంశాలు..
మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ పది బ్యాంకుల విలీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది.
మరోవైపు పీఎస్‌బీల్లో గవర్నెన్స్ పరమైన పలు సంస్కరణలను కూడా మంత్రి నిర్మలా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
బ్యాంకుల విలీనం-వివరాలు

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి.
- 2018 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి.
- నీరవ్ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్ మెసేజింగ్ వ్యవస్థను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కు (సీబీఎస్)కు అనుసంధానించడం జరిగింది.
- విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్ జనరల్ మేనేజర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. చీఫ్ రిస్క్ ఆఫీసర్‌లను కూడా నియ మించుకోవాల్సి ఉంటుంది.
- దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
Published date : 31 Aug 2019 05:38PM