పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Sakshi Education
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పౌరసత్య బిల్లు’కు జనవరి 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
దీంతో లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివాసం ఏర్పర్చుకోవచ్చు. ఈ మూడు దేశాల్లో వేధింపులు, హింసకు గురై భారత్‌కు వలసొచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇందులో ప్రతిపాదించారు. అలాగే పౌరసత్వం పొందేందుకు భారత్‌లో కనీస నివాస కాలాన్ని 12 ఏళ్ల నుంచి ఆరేళ్లకు కుదిస్తూ బిల్లులో ప్రతిపాదించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పౌరసత్వ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : లోక్‌సభ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పౌరసత్వ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : లోక్‌సభ
Published date : 09 Jan 2019 05:29PM