పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
Sakshi Education
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్యసాహసాలను స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశంగ చేర్చాలని రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా మార్చి 5న తెలిపారు. పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయమని, అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్

Published date : 06 Mar 2019 05:35PM