పాఠశాల విద్యలో కేరళకి మొదటి స్థానం
Sakshi Education
పాఠశాల విద్యా ప్రమాణాల విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చింది.
పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను విభజించి 2016-17 గణాంకాల ప్రకారం ఈ ర్యాంకులను సెప్టెంబర్ 30న ప్రకటించింది. 30 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
కేరళ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి. పాఠశాల విద్యా ప్రమాణాల్లో రాష్ట్రాల బలాలు, బలహీనతలు తెలియజేయడం, లోటుపాట్లను సరిదిద్దుకొనేలా రాష్ట్రాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాఠశాల విద్యలో కేరళకి మొదటి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశంలో

Published date : 01 Oct 2019 05:31PM