Skip to main content

పార్లమెంటులో 32 బిల్లులకు ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది.
జూన్ 17 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఈ సమావేశాల్లో లోక్‌సభ 35 బిల్లులకు ఆమోదం తెలపగా... రాజ్యసభ 32 బిల్లులను ఆమోదించింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు - 2019

 

17వ లోక్‌సభ మొదటి సమావేశాలు

249వ రాజ్యసభ సమావేశాలు

సెషన్ పూర్తికాలం

జూన్ 17-ఆగస్టు 6

జూన్ 20-ఆగస్టు7

సభ జరిగిన రోజులు

37

35

సభ కొనసాగిన సమయం

280 గంటలు

195 గంటలు

వాయిదాలు, ఇతర కారణాలతోవృథా అయిన సమయం

0

19.12 గంటలు

అదనపు సమయం

70.42 గంటలు

దాదాపు 28 గంటలు

సభ సఫలమైన శాతం

125

104.92

మౌఖిక సమాధానాలు లభించిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు

183

151

ఆమోదం పొందిన బిల్లులు

35

32

Published date : 08 Aug 2019 05:48PM

Photo Stories