Skip to main content

పార్లమెంటు సమావేశాలు ముగింపు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 13న ముగిశాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయసభల పనితీరును వెల్లడించారు.
Current Affairsలోక్‌సభ సమావేశాలు 116 శాతం(కేటాయించిన సమయం కంటే ఎక్కువ చర్చ), రాజ్యసభ సమావేశాలు 99 శాతం ఫలప్రదమయ్యాయని చెప్పారు. ఈ సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. అందులో లోక్‌సభ 14 బిల్లులను, రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందన్నారు.
 
 తెలుగులో సభా కార్యకలాపాలు
 పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా సందర్భంగా  రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘సభ్యులు తమ మాతృభాషల్లో మాట్లాడితే ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. నా మాతృభాష తెలుగులో ఒకరోజు సభా కార్యకలాపాలు నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నా’ అని వెంకయ్య పేర్కొన్నారు.
 
 2020కల్లా కొత్త పార్లమెంట్
 దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022కి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. 2022లో జరిగే పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Published date : 14 Dec 2019 05:19PM

Photo Stories