Skip to main content

పారిస్ ఓపెన్ టోర్ని చాంపియన్‌గా జొకోవిచ్

పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నవంబర్ 3న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 04 Nov 2019 05:42PM

Photo Stories