Skip to main content

పారిస్‌ మారథాన్-2020రద్దు

కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని మెగా క్రీడాంశాల ఈవెంట్స్‌పై పడుతోంది.
Current Affairs
తాజాగా రద్దయిన మెగా ఈవెంట్స్‌ జాబితాలో పారిస్‌ మారథాన్ చేరింది. వాస్తవానికి పారిస్‌ మారథాన్ 2020, ఏప్రిల్‌ 5నే జరగాల్సింది. అయితే ఆ సమయంలో ఫ్రాన్స్ లో కరోనా కేసులు భారీగా వచ్చాయి. దాంతో నిర్వాహకులు 2020, నవంబర్‌ 15కు ఈ మారథాన్ రేసును వాయిదా వేశారు. అయితే ఫ్రాన్స్ లో మళ్లీ కరోనా వైరస్‌ ఉధృతి పెరగడంతో నిర్వాహకులు ఈ రేసును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన రేసుల్లో ఈ మారథాన్ఒకటి. ఇందులో కనీసం 40 వేల మంది రన్నర్లు పాల్గొంటారు.

2020, జూన్ లో న్యూయార్క్‌ మారథాన్... ఆ తర్వాత 124 ఏళ్ల చరిత్రలో తొలిసారి బోస్టన్ మారథాన్... బెర్లిన్, షికాగో రేసులు కూడా రద్దయ్యాయి. 2020, ఏప్రిల్‌లో జరగాల్సిన లండన్ మారథాన్ ను అక్టోబర్‌ 4కు వాయిదా వేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పారిస్‌ మారథాన్-2020 రద్దు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎక్కడ :పారిస్‌, ఫ్రాన్స్
ఎందుకు :కరోనా వైరస్ కారణంగా
Published date : 13 Aug 2020 05:26PM

Photo Stories