Skip to main content

పాక్‌ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తున్నాం: ఎఫ్‌ఏటీఎఫ్

పాకిస్తాన్‌ను మరోసారి ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తున్నామని ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) వెల్లడించింది.
అమెరికాలో జూన్ 22న సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో పాకిస్తాన్ విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్ తెలిపింది. తాము నిర్దేశించిన 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను పాక్ అమలు చేయలేకపోయిందని విమర్శించింది. 2019, సెప్టెంబర్ చివరికల్లా ఈ లక్ష్యాలను చేరుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పాక్‌ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తున్నాం
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో విఫలమైనందుకు
Published date : 24 Jun 2019 06:28PM

Photo Stories