Skip to main content

పాక్‌లో 3 వేల ఏళ్ల నాటి నగరం గుర్తింపు

పెషావర్: పొరుగు దేశం పాకిస్థాన్‌లో మూడు వేల ఏళ్ల నాటి పురాతన నగరం జాడ వెలుగు చూసింది.
ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్ స్వాత్ జిల్లాలోని బరికోట్ తహసీల్ పరిధిలో గుర్తించిన ఈ నగరం పేరు బజీరా. పురావస్తు శాఖ పరిశోధనలో 3 వేల ఏళ్ల కిందట ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీన నాగరికతకు సంబంధించిన కళాఖండాలు, హిందూ దేవాలయాలు, నాణేలు, స్థూపాలు, కుండలు, ఆయుధాలను కూడా గుర్తించారు. క్రీ.పూ 326 కాలంలో అలెగ్జాండర్ చక్రవర్తి తన సేనతో కలసి స్వాత్ జిల్లాలోని ఒడిగ్రామ్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఓడించి.. బజీరా నగరాన్ని, కోటను నిర్మించారని నిపుణులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అలెగ్జాండర్‌కు పూర్వం నివసించిన వారి ఆనవాళ్లను పురావస్తు నిపుణులు గుర్తించారు. అలెగ్జాండర్‌కు ముందు ఇండో-గ్రీక్, బుధ్‌మట్, హిందూ షాహీ, ముస్లింలు ఈ ప్రాంతంలో జీవించేవారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: పాకిస్థాన్‌లో మూడు వేల ఏళ్ల నాటి పురాతన నగరం గుర్తింపు
ఎక్కడ: పాకిస్థాన్
Published date : 16 Nov 2019 06:00PM

Photo Stories