పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా
Sakshi Education
బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, వీసా గడువు ముగిశాక తిష్టవేసిన పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో పాకిస్తాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది.
దీంతో పాకిస్తాన్ పౌరులు, నివాసితులకు ఎటువంటి కారణం చూపకుండా వీసా ఆలస్యం చేయవచ్చు లేదా నిరాకరించేందుకు అమెరికా హోంశాఖకు అధికారం ఉంటుంది. ఈ పరిణామంతో అమెరికా ఆంక్షల భారం పడిన 10 దేశాల జాబితాలో పాకిస్తాన్ సైతం చేరినట్లయింది.ఆఫ్రికా దేశం ఘనాపైనా అమెరికా ఈ ఏడాది ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ రెండు దేశాలతోపాటు గయానా (2001), గాంబియా (2016), కాంబోడియా, ఎరిట్రియా, గినియా, సియెర్రాలియోన్ (2017), బర్మా, లావోస్ (2018)పైనా అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్‌పై ఆంక్షల
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : అమెరికా
ఎందుకు : అమెరికాలో తమ దేశ పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్‌పై ఆంక్షల
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : అమెరికా
ఎందుకు : అమెరికాలో తమ దేశ పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో
Published date : 29 Apr 2019 05:17PM