పాకిస్తాన్‌లో సివిల్ జడ్జిగా హిందూ మహిళ
Sakshi Education
పాకిస్తాన్‌లో మొదటిసారి సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా జనవరి 29న నియమితులైంది.
ఖంబర్-షాదద్కోట్ జిల్లాకు చెందిన కుమారి హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం కరాచీలోని స్జాబిస్ట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుమన్ కుమారి కంటే ముందు హిందూ మతం నుంచి జస్టిస్ రానా భగవాన్ దాస్ కొద్దికాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. పాకిస్తాన్ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలిసారి మహిళ సివిల్ న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : సుమన్ కుమారి
ఎక్కడ : పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలిసారి మహిళ సివిల్ న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : సుమన్ కుమారి
ఎక్కడ : పాకిస్తాన్
Published date : 30 Jan 2019 05:32PM