పాకిస్తాన్‌లో గురునానక్ స్మారక నాణెం విడుదల
Sakshi Education
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతిని (నవంబరు-12) పురస్కరించుకొని ఆయన స్మారక నాణేన్ని పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు నాణెం చిత్రాలను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అక్టోబర్ 30న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. రూ.50 విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్‌పూర్ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతారు.
మరోవైపు కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌కు వెళ్లే 575 మంది తొలి విడత యాత్రికుల జాబితాను పాక్‌కు భారత్ అందజేసింది. సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. దీనిని 2019, నవంబర్ 9న ప్రారంభించనున్నారు. పాక్‌లోని నారోవల్ జిల్లా రావి నది ఒడ్డున కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గురునానక్ స్మారక నాణెం విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : గురునానక్ దేవ్ 550వ జయంతిని (నవంబరు-12) పురస్కరించుకొని

Published date : 31 Oct 2019 05:36PM