పాకిస్తాన్‌లో భారత్ మెరుపు దాడులు
Sakshi Education
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్, చకోటిలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) శిబిరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది.
వెయ్యి పౌండ్ల బరువైన బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని వాయుసేన మట్టుపెట్టింది. 1971 యుద్ధం తరువాత పాకిస్తాన్ భూభాగంలో భారత్ వైమానిక దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. ఈ మెరుపు దాడల్లో భారత్ 12 మిరాజ్ -2000 యుద్ధ విమానాలను ఉపయోగించింది.
భారత్‌లో జైషే మహ్మద్ నుంచి పొంచి ఉన్న ఆత్మహుతి దాడుల ప్రమాదాన్ని అడ్డుకునేందుకు ఆ సంస్థ స్థావరాలపై దాడి తప్పనిసరి అయి్యందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సందర్భంగా వెల్లడించారు. నిర్దిష్టంగా జైషే శిబిరాన్నే లక్ష్యంగా చేసుకొని సైనికేతర దాడి చేశామని చెప్పారు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసి 40 మంది ధీర జవాన్లను బలిగొంది.
మిరాజ్-2000 విశేషాలు...
ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 1990లో మిరాజ్-2000 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. తర్వాత కాలంలో ఈ యుద్ధవిమానాలకు నూతన సాంకేతికతను జోడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేన మెరుపు దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : బాలకోట్
ఎక్కడ : బాలాకోట్, ముజఫరాబాద్, చకోటిలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) శిబిరాలపై

- పొడవు 14.36 మీటర్లు
- రెక్కల నిడివి 91.3 మీటర్లు
- బరువు 7,500 కిలోలు
- క్షిపణులతో కలిపి గరిష్ట బరువు 17,000 కిలోలు
- గరిష్ట వేగం గంటకు 2,336 కి.మీ.
- ఎగరగలిగే గరిష్ట ఎత్తు 17 కిలోమీటర్లు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేన మెరుపు దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : బాలకోట్
ఎక్కడ : బాలాకోట్, ముజఫరాబాద్, చకోటిలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) శిబిరాలపై
Published date : 27 Feb 2019 05:50PM