పాకిస్తాన్‌కు చైనా అందజేసిన అధునాతన యుద్ధనౌక పేరు?
Sakshi Education
లాంగ్‌రేంజ్ మిస్సైల్స్, మెరుగైన రాడార్ వ్యవస్థతో కూడిన అధునాతన యుద్ధనౌక ‘‘టైప్054ఏబైపీ’’ను పాకిస్థాన్‌కు చైనా జనవరి 29న అందజేసింది.
టైప్054ఏబైపీ యుద్ధనౌకలు నాలుగింటిని నిర్మించి ఇవ్వాలని 2017లో చైనాకు పాక్ కాంట్రాక్టు ఇచ్చింది. వీటిలో తొలినౌకను 2020, ఆగస్టులో పాక్‌కు అందించారు. తాజాగా రెండో నౌకను పాక్‌కు చైనా అందించింది. ఈ నౌకలను స్టెల్త్ మోడ్‌లో కూడా వాడవచ్చు. పాక్‌కు అన్ని రకాలుగా ఆయుధ సహకారం అందిస్తున్న చైనా, పాక్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్‌కు అధునాతన యుద్ధనౌక ‘‘టెప్054ఏబైపీ’’ అందజేత
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : చైనా
ఎందుకు : 2017లో పాకిస్తాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్‌కు అధునాతన యుద్ధనౌక ‘‘టెప్054ఏబైపీ’’ అందజేత
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : చైనా
ఎందుకు : 2017లో పాకిస్తాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు
Published date : 03 Feb 2021 05:32PM