పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్
Sakshi Education
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అరెస్టయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) బృందం జూన్ 10న అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి.
పాక్ ప్రధానిగా బేనజిర్ భుట్టో 1988-90, 1993-96 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008-13 సంవత్సరాల మధ్య పనిచేశారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : అసిఫ్ అలీ జర్దారీ
ఎందుకు : మనీ లాండరింగ్ కేసులో

Published date : 11 Jun 2019 06:47PM