పాకిస్తాన్ అణు క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
అణు వార్‌హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ‘ఘజ్నవి’ అనే క్షి పణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆగస్టు 29న పాకిస్తాన్ ప్రకటించింది.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొంది. అణు బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందించారని పాకిస్తాన్ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ తెలిపారు.
పాకిస్తాన్ ప్రభుత్వం 2019, జనవరిలో ‘నాజర్’, మే నెలలో ‘షహీన్-2’ అనే బాలిస్టిక్ మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షించిన ఘజ్నవి ద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు. స్కడ్ టైప్ బాలిస్టిక్ మిస్సైల్‌ను అభివృద్ధి చేసి ఘజ్నవిని రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఘజ్నవి అనేఅణు క్షి పణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : పాకిస్తాన్
ఎక్కడ : పాకిస్తాన్

Published date : 30 Aug 2019 05:11PM