పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు
Sakshi Education
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 2021, జూలై 25న జరగనుంది.
ఈ విషయాన్ని పీఓకే ఎన్నికల సంఘం ఉన్నతాధికారి జూన్ 10న ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ను పీఓకే రాజధాని పట్టణమైన ముజఫరాబాద్‌లోపీఓకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మాజీ జడ్జి అబ్దుల్ రషీద్ సులేరియా విడుదల చేశారు. 2020 ఏడాది పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిత్–బలిస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించింది. సైన్యం కబంధ హస్తాల్లో ఉన్న గిల్గిత్–బలిస్తాన్‌లో ఎన్నికలు నిర్వహించినంత మాత్రాన అక్కడి పరిస్థితుల్లో మార్పు రాబోదని భారత్ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుసహాగిల్గిత్–బలిస్తాన్.. భారత్‌లో అంతర్భామని పేర్కొంది.
Published date : 11 Jun 2021 06:47PM