Skip to main content

ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21కు సంబంధించి తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70994,98,38,000 (రూ.70,994.98 కోట్లు) వ్యయానికి వీలు కల్పించే ‘ద్రవ్య వినిమయ-ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్-2020’కు మార్చి 27న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Current Affairs కరోనా వైరస్ విస్తరించకుండా లాక్‌డౌన్ విధించి, వైద్య సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో 213 అధికరణంలో క్లాజ్-1 ప్రకారం రాబోయే మూడు నెలల్లో రూ.70,994.98 కోట్ల వ్యయానికి సంబంధించిన ఆర్డినెన్స్ కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
  • రెవెన్యూ వ్యయం రూ.52,521.43 కోట్లు
  • కేపిటల్ వ్యయం రూ.14,725.90 కోట్లు
  • రుణాలు చెల్లించడానికి రూ.263.86 కోట్లు
  • రుణంతో సమకూర్చుకునే మొత్తం రూ.3,483.77 కోట్లు
తాజా సమావేశంలో బడ్జెట్ ఆర్డినెన్స్ తో పాటు కరోనా వ్యాప్తి నిరోధానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించింది. కరోనా కట్టడికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
Published date : 28 Mar 2020 06:25PM

Photo Stories