Skip to main content

ఒమన్ సుల్తాన్ బిన్ సయీద్ కన్నుమూత

ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన ఒమన్ రాజు ఖుబాస్ బిన్ సయీద్ (79) జనవరి 10 కన్నుమూశారు.
Current Affairs1970 నుంచి పాలించిన ఆయన కేన్సర్‌తో బాధపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనకు పెళ్లి కాలేదు. దీంతో ఆయన వారసుడు ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒమన్ రాజ్యాంగం ప్రకారం రాజు సింహాసనాన్ని వదలిన మూడు రోజుల్లోగా కొత్త రాజు దాన్ని అధిష్టించాలి. బిన్ సయీద్‌కు వారసులు లేకపోవడంతో రాజ కుటుంబంలో సభ్యుడైన ‘ముస్లిం, యుక్త వయస్సు వచ్చిన వారు, హేతుబద్ధవాది, ఒమన్ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించిన’ వ్యక్తిని తదుపరి రాజుగా ఎన్నుకోవాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఒమన్ సుల్తాన్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఖుబాస్ బిన్ సయీద్ (79)

మాదిరి ప్రశ్నలు
Published date : 13 Jan 2020 05:50PM

Photo Stories