ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్ తజిందర్ అర్హత
Sakshi Education
ఇండియన్ గ్రాండ్‌ఫ్రీ–4 అథ్లెటిక్స్ మీట్ పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో తజిందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పాడు.
అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ మీట్‌లో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల తజిందర్ ఇనుప గుండును 21.49 మీటర్ల దూరం విసిరాడు.
ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అతను అధిగమించాడు. 20.92 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తజిందర్ సవరించాడు. తజిందర్ ధాటికి 12 ఏళ్ల ఆసియా రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోయింది. 21.13 మీటర్లతో 2009లో సుల్తాన్ అబ్దులుమ్ అల్ హెబ్షీ (సౌదీ అరేబియా) సాధించిన ఆసియా రికార్డును తజిందర్ బద్దలు కొట్టాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్
ఎప్పుడు: జూన్ 21
ఎవరు: తజిందర్ పాల్ సింగ్ తూర్
ఎక్కడ: ఇండియన్ గ్రాండ్‌ఫ్రీ–4 అథ్లెటిక్స్ మీట్, పాటియాలా

Published date : 22 Jun 2021 04:42PM