ఒలింపిక్స్‌కు బాక్సింగ్ అంబాసిడర్‌గా మేరీకోమ్
Sakshi Education
2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ బాక్సింగ్ అథ్లెట్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది.
2020 టోక్యో ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ప్రకటించిన 10 మంది సభ్యుల ‘బాక్సింగ్ అథ్లెట్ అంబాసిడర్స్ బృందం’లో మేరీ కోమ్ చోటు లభించింది. మేరీ కోమ్ ఆసియా బాక్సర్ల తరఫున అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఇలా బృందంలోని ఒక్కో దిగ్గజ బాక్సర్‌ను ఒక్కో ప్రాంతానికి కేటాయించారు.
అంబాసిడర్స్- ప్రాతినిధ్యం వహించే ప్రాంతం
పురుషులు: లుక్మో లవల్(ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రజ్(ఉత్తర-దక్షిణ అమెరికా), జియాంగ్వాన్ అషియాహు(ఆసియా), వాసిల్ లామచెంకో(యూరోప్), డేవిడ్ ఎన్‌యిక(ఓషియానియా).
మహిళలు: మేరీ కోమ్(ఆసియా), ఖాదిజ మార్డి(ఆఫ్రికా), మిఖైలా మేయర్(ఉత్తర-దక్షిణ అమెరికా), సారా ఔరహమౌనీ(యూరోప్), షెల్లీ వాట్స్(ఓషియానియా).
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఒలింపిక్స్‌కు బాక్సింగ్ అంబాసిడర్‌గా ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : మేరీ కోమ్

Published date : 01 Nov 2019 05:32PM