Skip to main content

ఒక్క డోసు టీకాకు అమెరికా అనుమతి

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది.
Current Affairsజాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి ఫిబ్రవరి 27న అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. ఈ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని జాన్సన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చింది.

చైనాలోనూ..
చైనా తయారు చేసిన సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ వినియోగానికి ఆ దేశం కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. చైనా యాడ్‌5–ఎన్‌కావ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు ఫిబ్రవరి 26న అనుమతులు ఇచ్చినట్టుగా గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది.

ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు...
అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 26న నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది.
Published date : 01 Mar 2021 06:12PM

Photo Stories