ఒక్క డాలర్‌కే న్యూజిలాండ్ మీడియా సంస్థ అమ్మకం
Sakshi Education
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’ను కేవలం డాలర్‌కే (మన రూపారుుల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రరుుస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్ మే 25న ప్రకటించింది.
ఈ డీల్ మే నెలాఖరుకు పూర్తవుతుందని తెలియజేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒక్క డాలర్‌కే మీడియా సంస్థ స్టఫ్ అమ్మకం
ఎప్పుడు : మే 25
ఎవరు : నైన్ ఎంటర్‌టైన్‌మెంట్
ఎక్కడ : న్యూజిలాండ్
ఎందుకు : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడంతో

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒక్క డాలర్‌కే మీడియా సంస్థ స్టఫ్ అమ్మకం
ఎప్పుడు : మే 25
ఎవరు : నైన్ ఎంటర్‌టైన్‌మెంట్
ఎక్కడ : న్యూజిలాండ్
ఎందుకు : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడంతో
Published date : 26 May 2020 06:27PM