Skip to main content

ఒడిశాలో 2023 ప్రపంచ కప్ హాకీ

ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్-2023ను నిర్వహించనున్నారు.
Current Affairsఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నవంబర్ 27న ప్రకటించారు. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగనున్నాయి. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్-2018కు కూడా భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే హాకీ ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.

భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో నవంబర్ 27న జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్-2023
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎక్కడ : భువనేశ్వర్, రూర్కేలా నగరాలు, ఒడిశా
Published date : 28 Nov 2019 05:54PM

Photo Stories