Skip to main content

ఓఐసీ సదస్సు ముఖ్య అతిథిగా భారత్

ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో భారత్ ముఖ్యఅతిథిగా పాల్గొననుంది.
ఈ మేరకు సదస్సులో పాల్గొనాలని భారత్ ను యూఏఈ ఫిబ్రవరి 24న ఆహ్వానించింది. 2019 మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్‌లో నివసిస్తున్న సుమారు 18 కోట్ల మంది ముస్లింలు, దేశ బహుళత్వం, వైవిధ్య పరిరక్షణలో వారి పాత్రను గుర్తిస్తూ ఓఐసీ ఈ ఆహ్వానం పంపింది. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సదస్సు ముఖ్య అతిథి
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : భారత్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 25 Feb 2019 05:33PM

Photo Stories