న్యూమోనియా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసిన తొలి భారతీయ సంస్థ?
Sakshi Education
న్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించే శక్తితో భారత్‌లో తొలిసారిగా న్యూమోకాక్కల్ కాంజుగేట్ వ్యాక్సీన్(పీవీసీ)ను అభివృద్ధి చేశారు.
‘‘న్యుమోసిల్’’ పేరుతో పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్ 28న విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్‌ను భారత్‌తో పాటు ఆఫ్రికా దేశమైన గాంబియాలో కూడా నిర్వహించారు. వ్యాక్సిన్ తయారిలో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు సహకారం అందించాయి.
‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా న్యూమోసిల్ వ్యాక్సిన్ అభివృద్ధి జరగడం మంచి పరిణామమని మంత్రి హర్ష పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘న్యుమోసిల్’’ పేరుతో న్యూమోనియా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసిన తొలి భారతీయ సంస్థ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
ఎందుకు : న్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించేందుకు

Published date : 29 Dec 2020 06:24PM