Skip to main content

న్యూజిలాండ్ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?

కేరళ రాష్ట్రానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో మంత్రిగా నియమితులయ్యారు.
Current Affairs
న్యూజిలాండ్ ‘కమ్యూనిటి మరియు వాలెంటరీ సెక్టార్’ మంత్రిగా 2020, నవంబర్ 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. భారతీయ సంతతికి చెందిన మహిళ న్యూజిలాండ్‌లో మంత్రి పదవి స్వీకరించడం ఇదే ప్రథమం. లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు అయిన 41 సంవత్సరాల ప్రియాంక సొంత ప్రాంతం కేరళలోని ఎర్నాకుళం సమీపంలోని పరవూర్. ప్రియాంక తల్లిదండ్రులు చెన్నైకు వలస రాగా ప్రియాంక అక్కడే జన్మించారు. అక్కడి నుంచి సింగపూర్‌లో ఆమె చదువు కొనసాగింది. పై చదువుల కోసం న్యూజిలాండ్‌లోని విక్టోరియా యూనివర్సిటీ (వెల్లింగ్‌టన్)కు వెళ్లి ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు.

సామాజిక కార్యకర్తగా...
న్యూజిలాండ్‌లో ఆక్‌లాండ్ కేంద్రంగా సామాజిక కార్యకర్తగా ప్రియాంక పనిచేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్ మూలవాసుల కోసం ఆమె పని చేశారు. 2006లో న్యూజిలాండ్ లేబర్‌పార్టీలో చేరి.. 2014 నుంచి ఎన్నికలలో పాల్గొన్నారు. 2017లో ‘మౌంగాకికి’ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. మంత్రిగా నియమితులవడానికి ముందు ఎత్నిక్ ఎఫైర్స్‌కి పార్లమెంటరీ ప్రయివేట్ సెక్రటరీగా పని చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : న్యూజిలాండ్ ‘కమ్యూనిటి మరియు వాలెంటరీ సెక్టార్’ మంత్రిగా నియామకం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రియాంక రాధాకృష్ణన్
Published date : 03 Nov 2020 05:58PM

Photo Stories