Skip to main content

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ జాన్ రీడ్ కన్నుమూత

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్టు క్రికెటర్ జాన్ రీడ్(92) కన్నుమూశారు. కివీస్‌కు ప్రాతినిధ్యం వారిలో అతి పెద్ద వయస్కుడైన జాన్ రీడ్ ఆక్లాండ్‌లో అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారని న్యూజిలాండ్ కికెట్ బోర్డు ప్రకటించింది.
Current Affairs
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో 1928, జూన్ 3న జన్మించిన జాన్ రీడ్ 19 ఏళ్ల వయస్సులో (1949) టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1950-60వ దశకాల్లో అద్భుతంగా ఆడిన ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు. 34 టెస్టుల్లో కివీస్‌కు సారథిగా వ్యవహరించాడు.

ఐసీసీ మ్యాచ్ రిఫరీగా...
టెస్టు క్రికెట్‌లో కివీస్ తరఫున 58 మ్యాచ్‌ల్లో 33.28 సగటుతో 3,428 పరుగులు చేసిన జాన్ రీడ్ 33.35 సగటుతో 85 వికెట్లు దక్కించుకున్నాడు. 246 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 41.35 సగటుతో 16,128 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా 22.60 సగటుతో 466 వికెట్లు దక్కించుకున్నాడు. 1965లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక న్యూజిలాండ్ సెలెక్టర్‌గా, మేనేజర్‌గా, ఐసీసీ మ్యాచ్ రిఫరీగా క్రికెట్‌కు సేవలందించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్టు క్రికెటర్ కన్నమూత
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : జాన్ రీడ్(92)
ఎక్కడ : ఆక్లాండ్, న్యూజిలాండ్
Published date : 15 Oct 2020 05:09PM

Photo Stories