Skip to main content

న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గం ప్రారంభం

సరుకు రవాణా కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైల్వే కారిడార్... ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో పరిధిలోని 351 కి.మీ.ల <b>‘న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా’</b> మార్గం ప్రారంభమైంది.
Current Affairs

డిసెంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మార్గాన్ని ప్రారంభించారు. అలాగే ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని ఈడీఎఫ్‌సీ ఆపరేషన్ కేంద్రాన్ని, న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గంలో 1.5 కి.మీ.ల పొడవైన తొలి గూడ్సు రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టు...

  • ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టులో మొత్తం 1,840 కి.మీ. మేర ప్రత్యేక ఫ్రీట్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది పంజాబ్‌లోని లూథియానా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వరకు ఉంటుంది.
  • తాజాగా ప్రారంభించిన 351 కి.మీ.ల న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా సెక్షన్‌ను రూ. 5,750 కోట్లతో నిర్మించారు. టాటా ప్రాజెక్ట్స్ ఇండియా-అల్దెశా గ్రూప్ సంస్థలు ఈ మార్గాన్ని నిర్మించాయి. 351 కి.మీ.ల ఈ మార్గం మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.


ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా ‘స్వావలంబ భారత్’ గర్జన స్పష్టంగా వినిపిస్తోంది.
  • తాజా సదుపాయంతో రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చగలరు.
  • సరకు రవాణా ఖర్చు తగ్గుతుందని, ఫలితంగా వస్తువుల ధరలు కూడా తగ్గడానికి వీలవుతుంది.
  • ఈడీఎఫ్‌సీకు 2006లోనే అనుమతి లభించింది. అయితే 2014 వరకు ఒక్క కి.మీ. కూడా ట్రాక్ వేయలేదు. నిధులను వినియోగించలేదు.
  • 2014లో మేం ప్రారంభించేనాటికి ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టు ఖర్చు 11 రెట్లు పెరిగింది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1,100 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా రైలు మార్గం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : సరుకు రవాణా కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైల్వే కారిడార్... ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా
Published date : 30 Dec 2020 06:02PM

Photo Stories