న్యాయాధికారుల సదస్సులో జస్టిస్ జేకే మహేశ్వరి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి పాల్గొన్నారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 1న ఈ సదస్సులో జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం...
అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
ఎక్కడ : ఆచార్య నాగార్జున వర్సిటీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

Published date : 02 Dec 2019 05:42PM