Skip to main content

నూతన వలస విధానం ఆవిష్కరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 16న నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు.
అమెరికాకు వలస రావాలనుకునేవారు ఇకపై ఇంగ్లీషు నేర్చుకోవడంతోపాటు అమెరికా చరిత్ర, సమాజం గురించిన ప్రాథమిక వాస్తవాలను తెలుసుకోవాలని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. అడ్మిషన్‌కు ముందు దరఖాస్తుదారులు పౌరశాస్త్ర (సివిక్స్) పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుందని పేర్కొన్నారు. స్కిల్డ్ వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని చెప్పారు. అయితే వీరంతా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగానే రావలసి ఉంటుందని ట్రంప్ వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నూతన వలస విధానం ఆవిష్కరణ
ఎప్పుడు : మే 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : అమెరికా
Published date : 17 May 2019 05:32PM

Photo Stories