Skip to main content

Narayan Rane: మహారాష్ట్రలో అరెస్ట్‌కు గురైన కేంద్ర మంత్రి?

2021 స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రసంగంపై కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే ఆగస్టు 23న చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న మంత్రి రాణే రాయ్‌గఢ్‌ జిల్లాలోని రత్నగిరిలో సీఎం ఉద్ధవ్‌పై చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణల చెలరేగాయి. దీంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదవగా... ఆగస్టు 24న మహారాష్ట్ర పోలీసులు మంత్రి రాణేను అరెస్ట్‌ చేశారు. అయితే ఆగస్టు 24వ తేదీనే మహాడ్‌ కోర్టు రూ.15 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

వాట్సాప్‌తో కేంద్రం ఒప్పందం
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కరోనా హెల్ప్‌ డెస్క్‌ (మైగవ్‌ ఇండియా), వాట్సాప్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు మన ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ యాప్‌ ద్వారా అత్యంత సులభంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తోంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అరెస్ట్‌ అయిన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : నారాయణ్‌ రాణే
ఎక్కడ : మహారాష్ట్ర
ఎందుకు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రసంగంపై మంత్రి రాణే చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు కారణమవడంతో...
Published date : 25 Aug 2021 06:55PM

Photo Stories