Skip to main content

నర్సుల సంవత్సరంగా 2020 : డబ్ల్యూహెచ్‌ఓ

2020 ఏడాదిని ‘నర్సులు, మంత్రసానుల సంవత్సరం(Year of the Nurse and the Midwife 2020)’ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.
Current Affairsరోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ప్రతీ వెయి్య మందికి ఒక డాక్టరు, ప్రతీ 400 మందికి ఒక నర్సు ఉండాలి. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా 19.80 లక్షల మంది నర్సులుండగా ఇంకా 20 లక్షల మంది నర్సులు అవసరం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నర్సుల సంవత్సరంగా 2020
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
Published date : 27 Dec 2019 05:21PM

Photo Stories