Skip to main content

నోట్రే డామే కేథడ్రల్‌లో అగ్ని ప్రమాదం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న ప్రసిద్ధ పురాతన చర్చి నోట్రే డామే కేథడ్రల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
చర్చిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతుండగా ఏప్రిల్ 15న మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఎటువంటి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్రీ.శ 1160 సంవత్సరంలో సేన్ నదీ తీరంలో నిర్మించిన ఈ చర్చిని ఏటా 1.2 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఫ్రెంచి నిర్మాణ శైలికి నోట్రే డామే చర్చిని తార్కాణంగా చెబుతుంటారు. ఈ చర్చిని పునర్‌నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో అగ్ని ప్రమాదం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 16 Apr 2019 05:58PM

Photo Stories