నోర్డియాక్ అవార్డును తిరస్కరించిన గ్రెటా
Sakshi Education
84 దేశాలు సభ్యులుగా ఉన్న నోర్డియాక్ కౌన్సిల్ ప్రకటించిన ‘ఎన్విరాన్‌మెంటల్ అవార్డు’ని పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్ తిరస్కరించింది.
తనకు కావాల్సింది అవార్డు కాదని, పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాల ఆచరణ అని 16 ఏళ్ల గ్రెటా పేర్కొంది. తన పోరాటాన్ని గుర్తించినందుకు నోర్డియాక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. స్వీడన్‌కు చెందిన గ్రెటా కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. 2018లో స్వీడన్ పార్లమెంట్ ఎదుట ఒంటరిగా ధర్నాకు దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే పర్యావరణ రక్షణకు ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎన్విరాన్‌మెంటల్ అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు కింద దాదాపు రూ. 36 లక్షల నగదు బహుమతి అందిస్తారు.
Published date : 31 Oct 2019 05:36PM