నమామి గంగేలో భాగంగా ఏ రాష్ట్రంలో నిర్మించిన ఆరు ఎస్టీపీలను ప్రధాని ప్రారంభించారు?
Sakshi Education
గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ మిషన్‌లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, రిషికేశ్, ముని-కి-రేతి, బద్రీనాథ్‌లో రూ.500 కోట్లతో నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను(ఎస్టీపీ) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.అలాగే జల్‌జీవన్ మిషన్ లోగోను ఆవిష్కరించారు.
ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి్యంది. సెప్టెంబర్ 29న సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడికి మాత్రం కోవిడ్ నెగెటివ్‌గా తేలింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.500 కోట్లతో నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీ) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరిద్వార్, రిషికేశ్, ముని-కి-రేతి, బద్రీనాథ్, ఉత్తరాఖండ్
ఎందుకు : గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ మిషన్‌లో భాగంగా

Published date : 30 Sep 2020 05:17PM